తెలంగాణ

telangana

ETV Bharat / state

భగీరథ పైపులైన్ లీక్​... వృథాగా పోయిన తాగునీరు - మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కిసాన్​నగర్​లో మిషన భగీరథ పైపులైన్​ లీకేజై... ఆ ప్రాంతంలో పెద్ద గుత్త ఏర్పడింది. నీరు వృథాగా పోవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

mission-bhagiratha-pipeline-leakage-at-balkonda-in-nizamabad
భగీరథ పైపులైన్ లీకేజీ... ఏర్పడిన పెద్దగుంత

By

Published : Apr 28, 2021, 12:02 PM IST

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కిసాన్‌నగర్‌లో మిషన్‌ భగీరథ పైపులైన్‌ లీకైంది. జలాల్‌పూర్‌ పంప్‌హౌస్​ నుంచి తాగునీటి సరఫరా అయ్యే పైప్‌ లీకేజీ అయింది. పాత జాతీయ రహదారిపైకి పెద్దఎత్తున నీరు చేరింది.

లీకేజీ అయిన ప్రాంతంలో పెద్ద గుంత పడడంతో పాటు.. సమీపంలో ఇసుక మేటలు వేశాయి. సుమారు గంట పాటు తాగునీరు వృథాగా పోయింది. సంబంధిత అధికారులు వచ్చి నీటి సరఫరాను నిలిపివేశారు.

భగీరథ పైపులైన్ లీక్​... వృథాగా పోయిన తాగునీరు

ఇదీ చూడండి:అ..ఆ..లు దిద్దకుండానే రెండులోకి...

ABOUT THE AUTHOR

...view details