రెండేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం నుంచి గోదావరి జలాలను శ్రీరాంసాగర్‌కు తరలించామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వరద నీటి మల్లింపు, వినియోగంలో... సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారని కొనియాడారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి పూజలు చేశారు. సీఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. రైతులకు సాగు నీటి విషయంలో ఎన్ని కోట్లు ఖర్చయినా... వెనుకాడే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ... భావోద్వేగానికి గురయ్యారు. ఈ ప్రాజెక్టు కోసం సీఎం కేసీఆర్‌తో ఎంత కష్టపడ్డారో తనకు తెలుసునని... వందల మంది ఇంజినీర్లు ఆహోరాత్రులు నిద్రలేకుండా శ్రమించారని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.
కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి...!
ముఖమంత్రి కేసీఆర్ రెండేళ్ల కాలంలోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం రైతులతో ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ... మధ్యలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
MINISTER VEMULA PRASHANTH REDDY GETS EMOTIONAL WHEN HE VISITS SRSP PROJECT