రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయడానికి యంత్రాంగం అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంవత్సరం రైతులకు ఇబ్బంది కలగకుండా కనీస మద్దతు ధర లభించేలా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని పేర్కొన్నారు. గత సంవత్సరం 293 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఈ ఏడు ఇప్పటివరకు 310 ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. ఈ ఏడు 40 నుంచి 50 శాతం అధికంగా దిగుబడి రానుందని ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని వేముల సూచించారు.
'నిజామాబాద్లో 310 ధాన్యం కొనుగోలు కేంద్రాలు' - రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
నిజామాబాద్లో 310 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పలు అధికారులతో భేటీ అయ్యారు.
'నిజామాబాద్లో 310 ధాన్యం కొనుగోలు కేంద్రాలు'
ఇదీ చూడండి : ప్రగతిభవన్ ముట్టడికి కాంగ్రెస్ యత్నం..