రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ వైద్యులు మాత్రం అప్రమత్తంగానే ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొవిడ్ కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన... జిల్లాలో కొవిడ్ వ్యాప్తి, లాక్డౌన్ అమలు తీరు, ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్షించారు.
కేసులు తగ్గుతున్నా వైద్యులు అప్రమత్తంగానే ఉండాలి: వేముల
రాష్ట్రంలో కొవిడ్ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన... జిల్లాలో కొవిడ్ వ్యాప్తి, లాక్డౌన్ అమలు తీరు, ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్షించారు.
ఇంటింటి సర్వే కోసం వచ్చే సిబ్బందికి ఇంట్లోని వారందరి ఆరోగ్య వివరాలు అందజేయాలని చెప్పారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత లేదని.. అయితే వాటి వినియోగంపై ఆడిటింగ్ జరపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా 16 వేల ఇంజక్షన్లు జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులకు అందించామని మంత్రి తెలిపారు. ధాన్యం సేకరణకు, వ్యవసాయ అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చామని రైతులను ఇబ్బంది పెట్టొద్దని పోలీసులకు మంత్రి వేముల సూచించారు.
ఇదీ చూడండి:అనవసరంగా బయటకొస్తే కేసులే..