పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రాధాన్యతనిచ్చి పట్టణాలు, నగరాలను సుందరంగా మార్చుకోవాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్‌లోని పర్యటించిన మంత్రి... పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. మున్సిపాలిటీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి పలు వీధుల్లో పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
'పట్టణాలు, నగరాలు సుందరంగా తయారుకావాలి' - నిజామాబాద్‌లో పట్టణప్రగతి
నిజామాబాద్‌లో నిర్వహించిన పట్టణప్రగతి కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వీధుల్లో పర్యటించి... అధికారులకు పలు సూచనలు చేశారు.
MINISTER PRASHANTH REDDY ATTENDED IN PATTANA PRAGATHI PROGRAM
ప్రతీ మున్సిపాలిటీలో విస్తృతంగా మొక్కలను నాటి సంరక్షించేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్, ట్యాంకర్‌ను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములై పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని సూచించారు.