నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో కరోనా కట్టడికై రాత్రింబవళ్లు శ్రమిస్తున్న ఉద్యోగులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. అన్ని మండల కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న వివిధ శాఖల ఉద్యోగులకు ఉచిత భోజనం ఏర్పాటు చేయాలని తెరాస శ్రేణులకు ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని లాక్డౌన్ ముగిసే వరకు నిర్వహించనున్నట్లు తెరాస నేతలు తెలిపారు.
ఉద్యోగులకు మంత్రి ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమం - కరోనా కట్టడి చర్యలు
తన నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరికీ తన సొంత డబ్బుతో ఉచిత మధ్యాహ్న భోజనాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. కరోనాని నియంత్రించడానికి అహర్నిశలు కృషిచేస్తున్న ఉద్యోగులకు ప్రతి మండలంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.
ఉద్యోగులకు మంత్రి ఉచిత మధ్యాహ్న భోజన కార్యక్రమం
వైద్య, పోలీసు, రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల ఉద్యోగులతో పాటు పంచాయతీ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు. ఉద్యోగులందరూ ప్రజల శ్రేయస్సు కోరి తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ కంటికి కనిపించని మహమ్మారితో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేస్తున్నారని తెరాస నాయకులు కొనియాడారు.
ఇదీ చూడండి:ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్