తెలంగాణ

telangana

ETV Bharat / state

అగమ్యగోచరంగా 67మంది వైద్య సిబ్బంది భవిష్యత్ - తెలంగాణ వార్తలు

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పనిచేసే 67 మంది వైద్య సిబ్బంది పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వైద్య విధాన పరిషత్ విభాగానికి చెందిన సిబ్బంది ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్​పై విధులు నిర్వర్తించేవారు. వీరి డిప్యూటేషన్ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. నెల రోజులు గడుస్తున్నా కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదని సిబ్బంది వాపోయారు.

  medical staff, nizamabad medical staff
నిజామాబాద్ జిల్లా, వైద్య సిబ్బంది

By

Published : May 31, 2021, 12:59 PM IST

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 67 మంది సిబ్బంది భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. వైద్య విధాన పరిషత్ విభాగానికి చెందిన సిబ్బంది ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్​పై నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తించేవారు. వీరి డిప్యూటేషన్ గడువు ఏప్రిల్ 30తో ముగిసింది. నెల రోజులు గడుస్తున్నా కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నుంచి రెన్యువల్ ఉత్తర్వులు వస్తేనే జీజీహెచ్​లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. మే నెల వేతనం రాదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. సిబ్బంది రెన్యువల్​పై కలెక్టర్, డీఎంఈకి విన్నవించామని.. ఆస్పత్రి నుంచి సిబ్బంది వెళ్లిపోతే కరోనా చికిత్స కష్టమవుతుందని చెబుతున్నాయి. కీలక విభాగాల్లో ఈ సిబ్బంది పని చేస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి:ఆనందయ్య మందు.. కోటయ్య మృతి

ABOUT THE AUTHOR

...view details