నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య, డ్రైనేజ్ పూడికతీత పనులను మేయర్ నీతూ కిరణ్ పర్యవేక్షించారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలో ఎక్కడా నీరు నిలువకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు.
'ఎక్కడా నీరు నిలవొద్దు.. దోమ కనిపించొద్దు' - నిజామాబాద్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మేయర్ పర్యవేక్షించారు
నిజామాబాద్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నగర మేయర్ నీతూ కిరణ్ కోరారు. పట్టణంలోని పలు డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె పర్యవేక్షించారు.
'ఎక్కడా నీరు నిలవకూడదు.. దోమ కానరాకూడదు'
ప్రజలు కూడా తడి, పొడి చెత్తను వేరుచేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని తెలిపారు. నిజామాబాద్ నగరాన్ని దోమల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు.