రాష్ట్రంలో భాజపా గాలి వీస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి నిజామాబాద్లో అన్నారు. ఇంత హడావుడిగా పుర ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధం అవుతున్నామని, ప్రతీ మున్సిపాలిటీకి ఒక బాధ్యుడిని నియమించి ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.
'తెలంగాణలో కమల వికాసం' - ప్రేమేందర్ రెడ్డి
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు చూస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. రానున్న పుర ఎన్నికల్లో కమలం వికసిస్తుందని చెప్పుకొచ్చారు.
పుర ఎన్నికల్లో కమలం వికసిస్తుంది : ప్రేమేందర్ రెడ్డి