నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలపై మాట్లాడుతూ వెళుతున్న సమయంలో... రెండు బైకులు ఢీకొన్నాయి. ఒక ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. ఇదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన లారీ.. కిందపడిన వారి మీద నుంచి దూసుకెళ్లింది.
బైకుపై నుంచి పడ్డవారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి - lorry hit bike and three people died in road accident at nizamabad
రెండు బైకులు ఒకదాన్నొకటి ఢీకొనగా ఒక ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందపడ్డారు. వెనుక నుంచి వచ్చిన ఓ లారీ.. వారి మీద నుంచి దూసుకెళ్లగా ముగ్గురు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద జరిగింది.
బైకుపై నుంచి పడ్డవారిపై దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి
ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు సిరికొండ మండలం కొండూరు గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అదనపు ఏసీపీ ప్రసాద్‌రావు తెలిపారు.
ఇవీ చూడండి:సాయం చేస్తే కుంభకోణం అనడం తగదు: కేసీఆర్