తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే నెలలో ఇందూరు వస్తా: సీఎం కేసీఆర్​ - BETI

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌... స్పీకర్​ ఛాంబర్​లో సమావేశమయ్యారు. జిల్లాలో తాగు, సాగు నీటి సమస్యలపై చర్చించారు.

NZB MLAS

By

Published : Sep 19, 2019, 5:59 PM IST

Updated : Sep 19, 2019, 7:33 PM IST

వచ్చే నెలలో ఇందూరు వస్తా: సీఎం కేసీఆర్​

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్‌ స్పీకర్​ ఛాంబర్​లో సమావేశమయ్యారు. నిజాం సాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల, ఆ ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీరు అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

హెచ్ఎండబ్ల్యుఎస్​, పరిగి, కోమటి బండ, ఎస్సారెస్పీ నుంచి ఎలా వీలైతే అంత తాగునీరు వీలైనన్ని గ్రామాలకు అందించాలన్నారు. మిగతా చోట్ల ట్యాంకర్లు, బోర్ల ద్వారా నీరందించాలని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే సింగూరు, నిజాంసాగర్ పరిధిలో ఈ సమస్య ఉంటుందని, వచ్చే ఏడాది నాటికి మల్లన్న సాగర్ ద్వారా ఈ రెండు ప్రాజెక్టులకు నీరందుతుందని చెప్పారు. ప్రజలు ఈ వేసవిలో ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఢోకా లేదు...

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీని లింక్ చేసినందున భవిష్యత్తులో ఎస్సారెస్పీ ఆయకట్టుకు ఢోకా ఉండదని సీఎం అన్నారు. గుత్ప, అలీసాగర్​ల మాదిరిగానే లిఫ్టులు పెట్టి బాన్సువాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజవర్గాలకు సాగునీరు అందివ్వాలని చెప్పారు. దీనికోసం తక్షణం సర్వే జరిపి, లిఫ్టులు ఎక్కడ పెట్టి, ఏఏ గ్రామాల పరిధిలో ఎన్ని ఎకరాలకు నీరందించవచ్చో తేల్చాలని నీటి పారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతీ ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా ఎస్సారెస్పీని నింపాలని ప్రభుత్వం నిర్ణయించినందున, దీని నుంచి ఎంత వీలైతే అంత ఆయకట్టుకు నీరివ్వాలని చెప్పారు. సాగు, తాగునీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి... శాశ్వతంగా పరిష్కరించేందుకు వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్​లో పర్యటించనున్నట్లు సీఎం వెల్లడించారు.

ఇవీ చూడండి:రైతులు నిశ్చింతగా ఉండొచ్చుః సీఎం కేసీఆర్

Last Updated : Sep 19, 2019, 7:33 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details