నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నపల్లికి చెందిన దుర్గం వెంకటేశ్ బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లారు. ప్రమాదవశాత్తు అక్కడ రెండు కాళ్లు విరిగిపోయాయి. స్వగ్రామానికి రాలేక నానా యాతన పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు విషయాన్ని మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లారు.
కల్వకుంట్ల కవిత సహకారం... స్వగృహానికి చేరుకున్న జన్నపల్లి వాసి - Nizamabad District latest News
మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం జన్నపల్లికి చెందిన దుర్గం వెంకటేశ్... ప్రమాదవశాత్తు దుబాయిలో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో కవిత సహకారంతో బాధితుడు స్వగ్రామానికి చేరుకున్నాడు.
కల్వకుంట్ల కవిత సహకారం : స్వగృహానికి చేరుకున్న జన్నపల్లి వాసి
కవిత చొరవతో వెంకటేశ్ దుబాయి నుంచి జన్నపల్లిలోని తన స్వగృహానికి తిరిగివచ్చారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబాన్ని మాజీ ఎంపీ కవిత ఆదుకోవడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.