కశ్మీర్లో ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన మహేశ్ భార్య సుహాసిని హైదరాబాద్ నుంచి భర్త స్వగ్రామం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్‌పల్లికి చేరుకుంది. భర్త మరణవార్త తెలియని సుహాసిని.. ప్రమాదం జరిగిందనే కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకుంది.
తీరని వేదన.. ఏం జరిగిందో తెలియక మహేశ్ భార్య ఆందోళన - మహేశ్ స్వగ్రామానికి చేరుకున్న భార్య సుహాసిని
కట్టుకున్న వాడితో జీవితాన్ని అందంగా ఊహించుకొని, ఎన్నో ఆశలతో మెట్టింట అడుగు పెట్టిన ఆమెకి రెండేళ్లకే తన జీవితం మోడుబారిపోయింది. కశ్మీర్లో శత్రుమూకతో ఎదురుకాల్పుల్లో పోరాడి భర్త వీరమరణం పొందాడని తెలియని ఆ భార్య తన ఇంటి సభ్యులు ఎందుకు ఏడుస్తున్నారో తెలియని సందిగ్ధంలో ఉండిపోయింది. 'నీ భర్త ఇక రాలేడు' అని చెప్పలేక వీరజవాన్ మహేశ్ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అక్కడున్న వారిని కలిచివేసింది.
వీరజవాన్ మహేశ్ స్వగ్రామానికి చేరుకున్న భార్య సుహాసిని
ఇంటికి చేరుకున్న తర్వాత బంధువులు అందరూ ఉండటంతో ఏం జరిగిందని అక్కుడున్న వారిని ప్రశ్నించింది. అనంతరం లోపలికి వెళ్లాక మహేశ్ తల్లిదండ్రులు సుహాసినిని చూసి బోరున విలపించారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆమె వారిని ఏమైందని ప్రశ్నించడం అక్కడున్న వారిని కలిచివేసింది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి