బోధన్‌లో ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి - bodan
స్వాతంత్ర్య యోధుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రాం జయంతిని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పలువురు పూల మాల వేసి నివాళులు అర్పించారు.
పూల మాల వేస్తున్న ఛైర్మన్, సీఐ
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని శక్కర్‌నగర్ చౌరస్తాలో బాబు జగ్జీవన్ రాం జయంతిని ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి మున్సిపల్ ఛైర్మన్ ఎల్లయ్య, సీఐ నాగార్జున గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహనీయుని ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని వక్తలు సూచించారు.