కరోనా రెండోదశ కొవిడ్ బాధితులతో పాటు సామాన్యుల్లోనూ ఆందోళన కలిగిస్తోంది. అనేక మానసిక సమస్యలకు గురిచేస్తోంది. వైరస్‌తో పాటు భయం కూడా ప్రాణాలు తీస్తోంది. ఈ సమస్యలన్నింటికీ... మనోధైర్యమే మందు అని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ చెబుతున్నారు. ఆలోచనా విధానం మార్చుకోవడం, ఒత్తిడిని తగ్గించే ఆహారం తీసుకోవడం, వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా కొవిడ్ నుంచి బయటపడొచ్చని చెబుతున్న మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్‌తో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి.
చుట్టుముడుతున్న మానసిక సమస్యలు... ఆందోళనలో వైరస్ బాధితులు - కొవిడ్ భయం
కొవిడ్ సోకుతుందనే భయంతోనే చాలామందికి మానసిక సమస్యలు వస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలోచనా విధానం మార్పుతోనే మానసిక రుగ్మతల నుంచి విముక్తి వస్తుందంటున్నారు. వ్యాయామం, యోగా వంటి వాటి ద్వారా మానసిక ధైర్యం వస్తుందని... క్రమం తప్పకుండా వీటిని చేస్తే మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
చుట్టుముడుతున్న మానసిక సమస్యలు... ఆందోళనలో వైరస్ బాధితులు