నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టులోకి 27,270 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఎస్సారెస్పీ గరిష్ఠ నీటిమట్టం 1,091 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1,057.20 అడుగులుగా ఉంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిలువ 90.313 కాగా ప్రస్తుత నీటి నిల్వ 10.907 టీఎంసీలుగా ఉంది. ఈ విధంగానే ప్రవాహం కొనసాగితే ప్రాజెక్టు త్వరగా నిండే అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాంసాగర్కు పెరిగిన వరద ప్రవాహం
గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవహం పెరుగుతోంది. ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే త్వరలోనే జలాశయం నిండుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరాంసాగర్కు పెరిగిన వరద ప్రవాహం