నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన రైతులు రెండు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి చెందిన 127 మందికి పట్టాలు ఇవ్వాలంటూ రైతులంతా ఆందోళన చేపట్టారు. గురువారం ధర్నా అనంతరం మీడియా ప్రతినిధులు వివరణ తీసుకునేందుకు ఎమ్మార్వో దగ్గరకు వెళ్లారు. వివరణ ఇస్తున్న క్రమంలో ఒక్కసారిగా తహసీల్దార్ అసదుల్లాఖాన్ కంటతడి పెట్టుకున్నారు. రైతులు ఆందోళన చేస్తున్న భూములకు సంబంధంచి 2017లోనే వక్ఫ్ భూములుగా ప్రభుత్వం గెజిట్ ఇచ్చిందని.. పట్టాల విషయం తన పరిధిలో లేదని ఎన్నిసార్లు చెప్పినా రైతులు అర్థం చేసుకోవడం లేదని తహసీల్దార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియా ముందు ఎమ్మార్వో కంటతడి - కందకుర్తి
ఎక్కడైనా రెవెన్యూ అధికారులు పెట్టే బాధకు రైతులు ఏడుస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఓ తహసీల్దార్ మీడియా ముందు కంటతడి పెట్టారు.
ఎమ్మార్వో కంటతడి
ఇవీ చూడండి: వరుసగా రెండోరోజు పాక్ కవ్వింపు చర్యలు