తెలంగాణ

telangana

ETV Bharat / state

'కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి'

నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఐఎఫ్​టీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డ ప్రైవేటు కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

By

Published : May 4, 2021, 8:41 AM IST

iftu protest
iftu protest

నిజామాబాద్ గ్రామీణ మండల పరిధి మల్లారంలోని ఓ ప్రైవేటు కళాశాల​ యాజమాన్యంపై ఐఎఫ్​టీయూ నాయకులు మండిపడ్డారు. కనీస వేతనాలు ఇవ్వమని అడిగినందుకు కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా వారిని విధుల్లోనుంచి తొలగించారంటూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

కార్మికులను వేధింపులకు గురి చేసిన ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, మేనేజర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వర్కర్స్​ యూనియన్ కార్యదర్శి బాలకృష్ణ, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి నిర్ణయం: ఈటల రాజేందర్​

ABOUT THE AUTHOR

...view details