తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను ఆవిష్కరించిన ఐ.ఎఫ్.టి.యు - iftu calls national wide strike on November 26th

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ ఐ.ఎఫ్.టి.యు నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కోటగల్లీలోని యూనియన్ కార్యాలయం శ్రామిక భవన్ లో ఆవిష్కరించారు.

IFTU unveils nationwide strike posters
దేశవ్యాప్త సమ్మె పోస్టర్లను ఆవిష్కరించిన ఐ.ఎఫ్.టి.యు

By

Published : Nov 13, 2020, 8:15 PM IST

కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకిస్తూ ఐ.ఎఫ్.టి.యు నవంబర్ 26న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టర్లను నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కోటగల్లీలోని యూనియన్ కార్యాలయం శ్రామిక భవన్ లో ఆవిష్కరించారు.

మోదీ ప్రభుత్వం కార్మికుల, రైతుల, సామాన్య ప్రజల హక్కుల మీద దాడి చేస్తుందని నాయకులు ఆరోపించారు. సులభతర వ్యాపారం అనే పేరుతో కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను కొనసాగిస్తోందని ఆగ్రహించారు. ఫలితంగా దేశంలోని 80 శాతం పైగా ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యు జిల్లా కార్యదర్శి బి.మల్లేష్, జిల్లా నాయకులు ఎం.సుధాకర్, డి.కిషన్, జీ.చరణ్, ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: హత్యకేసు విచారణలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు: ఎంపీ అర్వింద్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details