109 రైల్వే మార్గాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఐఎఫ్టీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి పూనుకుందని ఐఎఫ్టీయూ నగర అధ్యక్షుడు రవి కుమార్ ఆరోపించారు.
రైల్వే స్టేషన్ ఎదుట ఐఎఫ్టీయూ కార్యకర్తల ఆందోళన - నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఐఎఫ్టీయూ కార్యకర్తల ఆందోళన
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఐఎఫ్టీయూ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. కమీషన్ల కోసం భాజపా కేంద్ర ప్రభుత్వం రైల్వే మార్గాల ప్రైవీటీకరణకు పూనుకుందని ఆరోపించారు.
రైల్వే స్టేషన్ ఎదుట ఐఎఫ్టీయూ కార్యకర్తల ఆందోళన
రైల్వేలో లాభాల్లో ఉన్న వాటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మటానికి సిద్ధపడుతున్నారని విమర్శించారు. అధికారులు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజల కృషితోనే రైల్వే సంస్థ లాభాల్లో నడుస్తోందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం రైల్వేను కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి:కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన హరీశ్‌రావు