నిజామాబాద్ పట్టణంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఆరో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మపురి హిల్స్ కాలనీలో కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో 110 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలు, 12 ఆటోలు,కారు, పర్యటక బస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
గుర్తింపు కార్డులు లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించాలని సీపీ ప్రజలకు సూచించారు. నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించాలి: సీపీ కార్తికేయ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాహనాలను ఇతరులకు ఇవ్వొద్దని..వాళ్లు నేరం చేస్తే వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నేర నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలి : సీపీ
ఇవీ చూడండి : మంత్రి కేటీఆర్‌తో విదేశీ ప్రతినిధుల భేటీ