ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక ఐసీయూ
కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తగ్గకుండా అత్యాధునిక పరికరాలతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఐసీయూ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలను అందుబాటులో ఉంచారు. 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో అత్యాధునిక పరికరాలతో ఐసీయూ
పాము కాటు, విషం తాగడం, ఇతర ప్రమాదకరమైన పదార్థాలు సేవించిన వారి పొట్ట శుభ్రం చేసేందుకు సక్షన్ ఆపరేటర్ యంత్రం, గుండె పరిస్థితి, నాడి కొట్టుకోవడం, బిపి తదితర వివరాలు తెలిపేందుకు మానిటర్లు అందుబాటులో ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య పరికరాలతో ఐసీయూను ఏర్పాటు చేయడంతో సామాన్య ప్రజలకు సైతం కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందుతోందని జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Feb 10, 2019, 7:48 AM IST