నిజామాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్‌కు అపూర్వ స్పందన లభిస్తోంది. మెప్నా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్‌ను పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఆహార పదార్థాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. పిండి వంటలు, స్వీట్లు, మాంసాహార వంటకాలు అందుబాటులో ఉంచారు. తయారు చేసిన చోటే ఆరగిస్తూ సందర్శకులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నోరూరించే ఫెస్ట్ - shg
భోజన ప్రియులు ఎవరుండరు చెప్పండి.. శాకాహార, మాంసాహార రుచులు.. పిండివంటలతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్‌కు ప్రజలు తరలి వస్తున్నారు. తాజా వంటకాలు తింటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నోరూరించే ఫెస్ట్...
శేరి సంవృద్ధి ఉత్సవ్ 2019లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ఆహార పండుగ రేపటితో ముగుస్తుంది. విభిన్న రుచులు ఒకే చోట చేరిన ఈ ఫెస్టివల్‌కు రేపు సందర్శకుల తాకిడి పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
Last Updated : Feb 16, 2019, 11:24 AM IST