నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు ఆలస్యంగా చేరాయని... రెండు రోజుల తర్వాత సీల్ చేశారని నిజామాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌లో185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం చాలా పెద్ద విషయమని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసినట్లు అర్వింద్ వెల్లడించారు. చివరి గంటలో పోలింగ్ శాతం పెరిగిన విషయంపై కూడా చర్చించామని... ఓట్ల లెక్కింపు సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే మళ్లీ లెక్కించాలని కోరారు. స్ట్రాంగ్ రూముల వద్ద తమ మనుషులను కాపలా పెట్టుకునేందుకు అనుమతించాలని కోరారు.
"ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు ఆలస్యంగా చేరాయి"
ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు ఆలస్యంగా చేరాయని... రెండు రోజుల తర్వాత సీల్ చేశారని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్‌లో185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం చాలా పెద్ద విషయమని... తమ అనుమానాలన్ని నివృత్తి చేయాలని కోరారు.
"ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు ఆలస్యంగా చేరాయి"
Last Updated : Apr 15, 2019, 5:55 PM IST
TAGGED:
new