నిజామాబాద్ మార్కెట్ యార్డు పసుపు రాశులతో కళకళలాడింది. చాలా రోజుల తర్వాత విపణికి భారీగా పసుపు వచ్చింది. ఈ సీజన్ లోనే అత్యధికంగా 44,139 బస్తాల పసుపు మార్కెట్‌కు వచ్చింది. ఈ సీజన్లో మొదట ఐదు వేల బస్తాలు రాగా.. కొద్దిరోజుల నుంచి 15వేల నుంచి 20వేల బస్తాల పసుపు మార్కెట్‌కు వస్తోంది.
నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా తరలొచ్చిన పసుపు - తెలంగాణ వార్తలు
ఈ సంవత్సరం పసుపునకు మంచి రేటు రావటంతో నిజామాబాద్ మార్కెట్ యార్డు పసుపు రాశులతో కళకళలాడుతోంది. సోమావారం ఈ సీజన్ లోనే అత్యధికంగా 44,139 బస్తాల పసుపు మార్కెట్‌కు వచ్చింది.
నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా తరలొచ్చిన పసుపు
ఇటీవల క్రమంగా ధరలు పెరుగుతున్నందున కర్షకులు పసుపు తెచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో ఈరోజు భారీగా పసుపు మార్కెట్‌కు వచ్చింది. పంట భారీ రాకతో మార్కెట్ మొత్తం పసుపువర్ణంగా మారింది.
ఇదీ చదవండి:రాష్ట్రంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట ఉత్సవాలు: సీఎం