తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆరోగ్య సర్వే - క్షయ, కుష్ఠు వ్యాధి గ్రస్తుల గుర్తింపు

క్షయ, కుష్ఠు వ్యాధి గ్రస్తుల గుర్తింపు కోసం నిర్వహించనున్న సర్వే శిక్షణను నిజామాబాద్ జిల్లాలో డీఎంహెచ్  సుదర్శనం పరిశీలించారు.

సర్వేలో గుర్తించిన వారికి  వైద్య పరీక్షలు చేయిస్తాం : డీఎంహెచ్ఓ

By

Published : Aug 22, 2019, 8:00 PM IST

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం కిసాన్‌ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సుదర్శనం సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న క్షయ, కుష్ఠు వ్యాధి గ్రస్తుల గుర్తింపు కోసం నిర్వహించనున్న సర్వే శిక్షణను ఆయన పరిశీలించారు.
ఈనెల 26 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఆరోగ్య సర్వే నిర్వహించాలని డీఎంహెచ్ ఆదేశించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ కుష్ఠు, క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించాలని సూచించారు. సర్వేలో గుర్తించిన వారికి వైద్య పరీక్షలు చేయిస్తామని తెలిపారు. వీటి నివారణ కోసమే చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.

సర్వేలో గుర్తించిన వారికి వైద్య పరీక్షలు చేయిస్తాం : డీఎంహెచ్ఓ

ABOUT THE AUTHOR

...view details