తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందూరు రైతుల పిటిషన్​పై తీర్పు 8కి వాయిదా - hc-on-nzb-formers-case

రాష్ట్రమంతా ఆసక్తికరంగా చూస్తోన్న ఇందూరు లోక్​సభ ఎన్నికల అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. పోలింగ్​ను వాయిదా వేయాలంటూ రైతులు వేసిన పిటిషన్​పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కర్షకుల అభ్యర్థనలు, వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును ఈనెల 8కి వాయిదా వేసింది.

పోలింగ్​ను వాయిదా వేయాలి...

By

Published : Apr 4, 2019, 7:58 PM IST

పోలింగ్​ను వాయిదా వేయాలి...
నిజామాబాద్ ఎంపీ అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇందూరు ఎన్నికలు వాయిదా వేయాలని రైతు అభ్యర్థులు వేసిన వ్యాజ్యం​పై వాదనలు విన్న ధర్మాసనం.... తీర్పును ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

3 రోజుల ముందు గుర్తులా....?

నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్​ పద్ధతిలోనే నిర్వహించాలని ధర్మాసనాన్ని కోరినట్లు రైతు అభ్యర్థుల తరఫు న్యాయవాది రచనారెడ్డి తెలిపారు. రాజకీయ నాయకులు 3 నెలల నుంచి ప్రచారం చేసుకుంటే... రైతు అభ్యర్థులకు 3 రోజుల ముందు గుర్తులు కేటాయించటం సమంజసం కాదని వాదనలు వినిపించామన్నారు. అన్నిఅంశాలను దృష్టిలోకి తీసుకుని రెండో విడతలో పోలింగ్​ నిర్వహించాలని కోరినట్లు రచనారెడ్డి తెలిపారు.

రైతన్నల అభ్యర్థనలు విన్న ధర్మాసనం సోమవారం వెలువరించే తీర్పుపై భవిష్యత్​ కార్యాచరణ ఉండనుందని రచనారెడ్డి వెల్లడించారు.

ఇవీ చూడండి:'సుప్రీం' సమాచార హక్కు చట్టం పరిధిలోకొస్తుందా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details