Gun firing at Indalwai Toll Gate in Nizamabad : బెదిరింపులు.. దోపిడీలు.. అపహరణలు.. హత్యలు.. ఇవన్నీ చేయాలంటే గన్నులుండాలి. కూర్చొని పరిష్కరించుకోవడం కాదు.. ధనాధన్ ఫటాఫట్‌గా వ్యవహారం తేలిపోవాలని రౌడీషీటర్లు, నేరస్థులు పిస్తోళ్లు.. రివాల్వర్లను వినియోగిస్తున్నారు. రాజకీయ నేతలు, వారి అనుచరులు, వ్యాపారులూ స్థిరాస్తి సెటిల్‌మెంట్లకు ఆయుధాలను ఉపయోగిస్తున్నారు. రౌడీషీటర్లు, నేరస్థుల చేతుల్లోనే 80 శాతం వరకూ ఆయుధాలుఉంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ చిన్నపాటి ఘర్షణ జరిగినా తుపాకులతో కాల్పులు జరపడం ఈ మధ్య పరిపాటిగా మారింది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో పోలీసులు జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.
ఆదివారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద జరిగిన కాల్పులు కలకలం రేపాయి. తన వాహనంపై దొంగలు దూసుకురావడంతో.. ఆత్మరక్షణ కోసం ఎస్సై గాల్లో కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ మండలంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కాపర్ కాయిల్ చోరీ చేసిన అంతర్‌రాష్ట్ర ముఠా44వ జాతీయ రహదారి మీదుగా వెళ్తోందని పోలీసులకు ఆదివారం అర్ధరాత్రి సమాచారం వచ్చింది. ఈ క్రమంలో విషయం తెలిసిన ముప్కాల్ పోలీసులు వారిని వెంబడించగా దొంగల ముఠా రూట్ మార్చి డిచ్‌పల్లి వైపు వెళ్లారు.