తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలి'

నిజామాబాద్​ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న పలు అభివృద్ధి కార్యక్రమాల పనితీరును జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులన్నీ వచ్చే యేడు మే నెల చివరికల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Dec 29, 2020, 8:05 PM IST

Govt lands should be kept free from occupation says nizamabad collecter
'ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడాలి'

నిజామాబాద్​ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్​లు, మైనారిటీ పాఠశాల, నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాల పనితీరును కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనులన్నీ వచ్చే యేడు మే నెల చివరికల్లా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్.. పనులను వేగవంతం చేసి, 15 రోజుల్లో ఫర్నిచర్​ను ఏర్పాటు చేయలన్నారు.

జిల్లాలోని ప్రభుత్వ భూముల వివరాలను సర్వే చేసి తనకు అందించాలని ఆర్డీఓను ఆదేశించారు కలెక్టర్​. భూములు కబ్జాకు గురికాకుండా.. చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కలెక్టర్​తో పాటు మున్సిపల్ కమిషనర్ జితేష్, ఆర్​అండ్​బీ ఎస్​ఈ రాజేశ్వర్ రెడ్డి, ఆర్డీఓ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:డిమాండ్ పెరుగుతున్న వేళ... మాయమవుతున్న ప్రభుత్వ భూములు

ABOUT THE AUTHOR

...view details