ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.10 లక్షల విలువ చేసే అరుదైన శస్త్ర చికిత్స చేసి వ్యక్తిని క్యాన్సర్ బారిన పడకుండా వైద్యులు కాపాడారు. ఈ ఆపరేషన్ గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన గంగాధర్(40) శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సంప్రదించగా.. ఆమ్లో బ్లాష్టోమా సంబంధిత కణతి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
అరుదైన చికిత్స చేసి.. క్యాన్సర్ బారి నుంచి కాపాడి..! - Gangadara rare operation
Government doctors who performed rare surgerie: ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పట్టించుకోరు అని చాలా మంది అనుకొంటూ ఉంటారు. అలానే అనుకోంటే తప్పుగా ఆలోచించినట్టే. నిజామాబాద్ జిల్లాలోని ఒక అరుదైన శస్త్ర చికిత్స ప్రభుత్వ ఆస్పత్రిలో చేశారు. ఇందులో డాక్టర్లు విజయం వంతంగా ఆపరేషన్ చేశారు.
అరుదైన శస్త్ర చికిత్స
కంటికి కింద దవడపై లోపలి భాగంలో ఈ ఆమ్లో బ్లాష్టం శస్త్ర చికిత్స చేశారు. ఈ చికిత్సలో మక్సిల్లో ఫేషియల్, ఈఎన్టీ, దంత వైద్య నిపుణులు, అనస్తేషియాకు సంబంధించిన వైద్యులు సుమారు 5 గంటలు పాటు శ్రమించారన్నారు. ఈ చికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమా రాజ్ అభినందించారు.
ఇవీ చదవండి: