తెలంగాణ

telangana

Girl Committed Suicide At Nizamabad : చిన్నారి ప్రాణం తీసిన రూ.600..

By

Published : Jun 8, 2023, 9:17 PM IST

Girl Committed Suicide By Hanging : చిన్న విషయాలకు విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు నేటి తరం పిల్లలు. నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం శివతాండలో దొంగతనం నింద భరించలేక ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకుంది. తల్లితో ఫోన్ మాట్లాడేందుకు పక్కింటి వ్యక్తి ఫోన్ తీసుకున్న చిన్నారి.. ఫోన్ పౌచ్‌లో ఉన్న డబ్బులు దొంగిలించిందని నిందలు భరించలేక ఉరివేసుకొని మృతి చెందింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించారు.

Girl Committed Suicide
Girl Committed Suicide

Girl Committed Suicide In Nizamabad Today : తెలిసీ.. తెలియని వయసు. చిన్న సమస్య వచ్చినా ఎదుర్కొలేని మనస్సు. కష్టం వస్తే చాలూ చావే శరణ్యమనుకునే పరిస్థితి. ఇలా చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న పిల్లలు.. కన్నవారికి తీరని వేదన మిగుల్చుతున్నారు. ఎవరేమైనా అంటే.. ఆ మాటలను తీసుకునే గుణాన్ని ఈ తరం పిల్లలు కోల్పోతున్నారు. తాజాగా రూ.600 దొంగతనం చేసిందనే నిందను మోయలేక.. రేపటి గురించి ఆలోచించకుండా చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. తప్పు తనలో లేకపోయిన కేవలం నిందను మోయాల్సి వస్తోందనే మనస్తాపంతో ఉరివేసుకొని.. తిరిగి రాని లోకానికి వెళ్లిపోయింది. హృదయాలను కదిలించే ఈ ఘటన.. నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేట మండలం శివతాండలో చోటుచేసుకుంది.

చిన్నారి

పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శివతాండలో మృతురాలి కుటుంబం నివాసం ఉంటున్నారు. తల్లి కూలి పనుల మీద బయటకు వెళ్లింది. తల్లితో మాట్లాడాలని చిన్నారి.. పక్కింటిలో ఉండే ప్రవీణ్‌ అనే వ్యక్తి ఫోన్‌ తీసుకుంది. సెల్‌ఫోన్‌లో మాట్లాడి అతనికి తిరిగి ఇచ్చేసింది. ఇంతలోనే ఫోన్‌ పౌచ్‌లో రూ.600 పోయాయని గమనించాడు. ఆ డబ్బులను బాలికనే తీసిందని అనుమానించి.. దొంగతనం చేసిందని లేనిపోని మాటలతో ప్రవీణ్‌, తల్లి బులి బాయి దూషించారు.

Girl Commits Suicide In Nizamabad : తాను ఎలాంటి దొంగతనం చేయలేదని చెప్పిన.. వినిపించుకోకుండా నిందలు వేశారు. ఆ నిందనలను భరించలేక.. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానే బాధతో ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిన్న పిల్ల హృదయమైన నేటి సామాజిక మాధ్యమాల ప్రభావంతో.. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా క్షణాకావేశంలో తీసుకున్న నిర్ణయాలు.. ఇలాంటి ఎన్నో విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయి. ఒక్క క్షణం ఆలోచిస్తే.. చేస్తోందని తప్పా ఒప్పా అనేది తెలుస్తోంది.

Girl Suicide At Nizamabad : తర్వాత ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న నిజామాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు ప్రారంభించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన.. ప్రవీణ్‌, అతని తల్లిపై కేసు నమోదు చేశారు. బాలిక తల్లి దుఃఖాన్ని అపడం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటనతో ఆ తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకు ఆడుకుంటూ ఉల్లాసంగా ఉన్న చిన్నారి.. ఇలా ఎందుకు చేసుకుందని స్థానికులు బాధపడ్డారు. ఆలోచించడానికి అవకాశం లేకుండా చేసుకుంటూ.. ఇప్పటి పిల్లు బతుకులను బుగ్గిపాలు చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details