నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్ పల్లిలో మంగళవారం విందుకు వచ్చిన బంధువులు ఈ రోజు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరేచనాలు కావడం వల్ల బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం వండిన వంటలు.. బుధవారం ఉదయం తినడంతోనే అనారోగ్యపాలయ్యామని బాధితులు తెలిపారు. మొత్తం 10 మంది అస్వస్థతకు గురవ్వగా వారిలో నలుగురు పిల్లలు ఉన్నారు. బాధితులు వర్ని మండలం అంతపూర్ తండాకు చెందినవారు.
ఆస్పత్రిపాలు చేసిన విందు వంటలు - nizamabad
బంధువుల విందు వారి ప్రాణాలమీదకు తెచ్చింది. నిజామాబాద్ జిల్లా మినార్ పల్లిలో మంగళవారం వండిన వంటలు ఇవాళ తినడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆస్పత్రిపాలు చేసిన విందు వంటలు