నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం రాత్రి వర్షం కురిసింది. నవీపేట్ మండలంలోని ధర్మారం కొనుగోలు కేంద్రంలో అరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. అరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అకాల వర్షంతో నష్టపోయిన అన్నదాతలు
నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం రాత్రి కురిసిన వర్షానికి నీట మునిగింది. ఈ నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. పలు సాకులతో అధికారులు ధాన్యాన్ని కొనడం లేదని కొంతమంది రైతులు ఆరోపిస్తున్నారు.
అకాల వర్షంతో నష్టపోయిన అన్నదాతలు
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరారు. ధాన్యాన్ని కొనేందుకు అధికారులు పలు కారణాలు చూపుతూ ఆలస్యం చేయడం వల్లనే... కొనుగోలు కేంద్రంలో పంట రోజుల తరబడి ఉంటుందని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు