నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోలదీప్లాకు ఇద్దరు కొడుకులుండగా... రెండో కుమారుడు శ్రీనివాస్‌తో కలిసి మద్దికుంట చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీళ్లలో జారి పడ్డారు. ఇద్దరికీ ఈత రాకపోవటం వల్ల నీళ్లలో మునిగి మృతి చెందారు.
చేపల వేటకు వెళ్లి తండ్రీకొడుకులు మృతి - CRIME NEWS IN TELANGANA
చేపల వేటకని వెళ్లిన ఆ తండ్రీ కొడుకులను మృత్యువు వెంటాడింది. కుటుంబ పెద్దను దూరం చేయటంతో పాటు... కొడుకును కూడా మింగేసి మూడేళ్ల కూతురుని, నాలుగు నెలల గర్భవతిని అనాథలను చేసింది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లా మినార్పల్లిలో జరిగింది.
FATHER AND SON DIED DUE TO FALL IN POND
రెక్కాడితే గాని డొక్కా డని దయనీయ పరిస్థితిలో ఉన్న వారి కుటుంబం ఈ ఘటనతో పెద్ద దిక్కును కోల్పోయింది. శ్రీనివాస్‌కి ఐదేళ్ల క్రితం పెళ్లి కాగా.... మూడేళ్ల కూతురు ఉంది. శ్రీనివాస్ భార్య ప్రస్తుతం 4 నెలల గర్భవతి. ఘటనస్థలిలో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.