నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి సహకార సంఘం వద్ద రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో పలు గ్రామాల రైతులు ఉదయం నుంచి బారులు తీరారు. ప్రభుత్వం నుంచి విత్తనాలు తక్కువగా వచ్చాయని ముందుగా సహకార సంఘం పరిధిలోని రైతులకు మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పడంతో ఇతర గ్రామాల రైతుల నుంచి ఆందోళన వ్యక్తమైంది.
ఇందల్వాయిలో విత్తనాల కోసం రైతుల అగచాట్లు - రైతుల అవస్థలు
నల్లవెల్లి సహకార సంఘం వద్ద.. రాయితీపై ప్రభుత్వం అందించే విత్తనాల కోసం రైతులు అగచాట్లు పడ్డారు. డిమాండ్ కన్నా విత్తనాల బస్తాలు తక్కువ రావడంతో వాటిని పొందాలని రైతులు కొవిడ్ నిబంధనలను సైతం గాలికొదిలేశారు.
ఇందల్వాయిలో విత్తనాల కోసం రైతుల అగచాట్లు
తాము అందరితో పాటే ఉదయం నుంచి వరుసలో నిల్చున్నామని తమకు తప్పనిసరి రాయితీ విత్తనాలు అందించాలని డిమాండ్ చేశారు. కార్యాలయం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డిమాండ్ మేర విత్తనాలను సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పెద్దది కాకముందే వరుసలో నిల్చున్న రైతులకు రాయితీ విత్తనాలు అందజేయాలని మండల వ్యవసాయ అధికారి స్వప్న సూచించారు.
ఇదీ చూడండి:చిన్నారిని అనాథ చేసిన కరోనా