Farmers Celebrations Over Turmeric Board Telangana :రాష్ట్రంలో పసుపు పంట పేరు చెబితే నిజామాబాద్ జిల్లానే గుర్తొస్తుంది. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పసుపు పంట సాగు(Turmeric Cultivation) చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక పసుపు మార్కెట్(Turmeric Market) సైతం ఇందూరులోనే ఉంది. ఏటా నిజామాబాద్ మార్కెట్‌కు ఆరు లక్షల క్వింటాళ్లకు పైగా పసుపు పంట రైతులు తెస్తుంటారు. నిజామాబాద్‌తో పాటు జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో పసుపు పంట సాగవుతున్నా.. నిజామాబాద్‌లోనే అత్యధికంగా 35 వేలకు పైగా ఎకరాల్లో పండిస్తున్నారు.
PM Modi SanctionedTurmeric Board Telangana :పసుపు పంట సాగు చేస్తే బంగారం పండించినట్లేనని రాష్ట్రంలో రైతులు చెప్పుకునే మాట. అందుకు తగ్గట్టే 2011లో తులం బంగారం 16 వేలు ఉంటే.. క్వింటా పసుపు అదే ధర పలికింది. అలాంటి స్థితి నుంచి క్రమంగా మద్దతు ధర పడిపోయి రైతులు నష్టాలు చవిచూశారు. 2018 ఎన్నికలకు ముంగిట పసుపు రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. వివిధ రూపాల్లో నిరసనలతో హోరెత్తించి పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటుతో పాటు మద్దతు ధర కల్పించాలని నినదించారు.
Turmeric Farmers Celebrations in Nizamabad :పసుపు బోర్డు కోసం రైతులు పోరాటం ఉద్ధృతం చేసిన తరుణంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను అస్త్రంగా చేసుకున్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లో 178 మంది రైతులు బరిలో దిగి లక్ష ఓట్లు సాధించారు. అదే సమయంలో బీజేపీ జాతీయ నాయకులు(BJP National Leaders) పసుపు బోర్డు ఇస్తామని హామీ ఇచ్చారు. కమలం అభ్యర్థిగా ఉన్న ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) పసుపు బోర్డు తెస్తానని లేకుంటే రాజీనామా చేస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ పోలింగ్ పోరులో అర్వింద్.. ఘన విజయం సాధించారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాల సంస్థ విస్తరణ కేంద్రాన్ని సాధించారు. జాతీయ పసుపు బోర్డు ప్రకటనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. సహకరించిన బీజేపీ జాతీయ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.