నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత వారం నుంచి కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. పక్కనున్న మహారాష్ట్రలో వైరస్ ఉద్ధృతి అధికంగా ఉండటంతో అధికారులు సరిహద్దుల్లోనే నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. వ్యాక్సినేషన్‌కు అంతగా ఆసక్తి చూపడంలేదని... అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని అంటున్న కలెక్టర్ నారాయణరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..
కరోనా లక్షణాలు లేకున్నా వ్యాక్సినేషన్ తప్పనిసరి: నారాయణ రెడ్డి
రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. నిజామాబాద్ జిల్లా ఇందుకు మినహాయింపేం కాదు. మహారాష్ట్రలో కరోనా కేసుల తీవ్రత ప్రభావం జిల్లాపై అధికంగానే ఉంది. అందుకే ఈ సమయంలో కలెక్టర్ నారాయణరెడ్డి ప్రజలకు పలు సూచనలు చేస్తున్నారు. వైరస్‌పై నిర్లక్ష్యం తగదని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. సరిహద్దుల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
నిజామాబాద్ కలెక్టర్