తెలంగాణ

telangana

ETV Bharat / state

దుబాయ్​లో చిక్కుకున్న క్యాన్సర్​ బాధితుడికి మాజీ ఎంపీ కవిత చేయూత - latest news of kavitha helped to the dubai traped person

తీవ్ర అనారోగ్యంతో దుబాయ్​లో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లాకు చెందిన చిన్నారెడ్డికి మాజీ ఎంపీ ‌కల్వకుంట్ల కవిత చేయూతనిచ్చారు. అతను భారత్​కు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించి క్షేమంగా స్వస్థలానికి చేర్చారు.

ex mp Kavitha helped Nizamabad man trapped in Dubai
దుబాయ్​లో చిక్కుకున్న క్యాన్సర్​ బాధితుడికి మాజీ ఎంపీ కవిత చేయూత

By

Published : Jul 1, 2020, 8:10 PM IST

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిన్నారెడ్డికి గత ఏడాది డిసెంబరులో క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. మూడు నెలల క్రితం కంపెనీ నుంచి తనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోడానికి అతను దుబాయ్ వెళ్లాడు. అయితే కేవలం 15 రోజులకు సరిపడా మందులు మాత్రమే తీసుకెళ్లిన చిన్నారెడ్డికి లాక్​డౌన్ రూపంలో కష్టాలు మొదలయ్యాయి. దుబాయ్​లో మందులు దొరక్క, కీమోథెరపీ జరగక ఇబ్బందులు పడ్డాడు. ఇండియా కూడా వచ్చేందుకు అవకాశం లేకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.

అతని అనారోగ్యం విషయం తెలుసుకున్న అతని భార్య, తల్లి, ఇద్దరు కూతుళ్లు కన్నీరు మున్నీరవుతూ సహాయం కోసం ఎదురుచూశారు. తనను ఆదుకోవాల్సిందిగా, ఇండియా వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా మాజీ ఎంపీ కవితను సోషల్ మీడియాలో వీడియో ద్వారా చిన్నారెడ్డి కోరాడు. మరోవైపు ఇదే విషయమై కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కూడా ఈ విషయమై కవితను సంప్రదించారు.

దీనిపై వెంటనే స్పందించిన ఆమె దుబాయ్​లోని ఈటీసీఏ నాయకుడు కిరణ్ ద్వారా చిన్నారెడ్డికి సహాయసహకారాలు అందించారు. ఫ్లైట్ టికెట్ బుక్​చేయించి స్వస్థలానికి చేర్చారు. కాగా చిన్నారెడ్డి తీవ్ర అనారోగ్యం దృష్ట్యా, స్వగ్రామంలో హోం క్వారంటైన్​లో ఉండేందుకు అధికారులు అనుమతించారు. అడిగిన వెంటనే స్పందించి, ఇండియా వచ్చేందుకు సహకరించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు చిన్నారెడ్డి, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చూడండి:'సిద్ధ'వైద్యంతో కరోనాకు చెక్​.. మధురై వైద్యుడి ఘనత!

ABOUT THE AUTHOR

...view details