కొవిడ్ బారిన పడిన చాలా మంది జీర్ణ సంబంధ వ్యాధులతో బాధ పడుతున్నారని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ రెడ్డి తెలిపారు. కడుపులో మంట, మలబద్దకం, అజీర్తి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈటీవీ భారత్ ఫోన్ ఇన్‌లో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఓపిగ్గా డాక్టర్ ఆశిష్ రెడ్డి సమాధానమిచ్చారు.
'కొవిడ్ బాధితులకు ఆహార నియమాలు తప్పనిసరి'
కొవిడ్ సోకిన వారు కచ్చితంగా ఆహార నియమాలు పాటించాలని నిజామాబాద్‌కు చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ రెడ్డి సూచించారు. కరోనా బారిన పడిన చాలామందిలో జీర్ణసంబంధ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
ఈటీవీ భారత్ నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమం
జీర్ణ సమస్యను అలాగే వదిలేయకుండా సరైన ఔషధాలు వాడుతూ జీవన విధానం, ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవాలని సూచించారు. కొవిడ్ బాధితులు వీలైనంత వరకు మసాలా, ఆయిల్ ఉండే ఆహారం తీసుకోవడం తగ్గించాలని డాక్టర్ ఆశిష్ రెడ్డి స్పష్టం చేశారు.