తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2020, 6:48 PM IST

ETV Bharat / state

ధాన్యాన్ని దగ్ధం చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులు

ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చాక... రోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడం భరించని అన్నదాతలు ధాన్యాన్ని దగ్ధం చేసి మరీ తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.

DICHPALLY FARMERS PROTEST
ధాన్యాన్ని దగ్ధం చేస్తూ నిరసన తెలుపుతున్న రైతులు

నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం గొల్లపల్లిలో ధాన్యం తూకం వేయడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటను దగ్ధం చేసి మరీ తన నిరసనను తెలుపుతున్నారు. వీటికి తోడు హమాలీల కొరత మరింత వేధిస్తోందని ఆందోళన చెందుతున్నారు.

పంట చేతికొచ్చాక ఆరబెట్టిన పంట అకాల వర్షానికి ఎప్పుడు నాశనమవుతుందో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను వేగవంతం చేసి హమాలీల కొరత తీర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చూడండి:మే 7 తర్వాత కరీంనగర్‌ కరోనా ఫ్రీ జోన్‌ : మంత్రి గంగుల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details