నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం చింరాజ్పల్లి గ్రామంలో రైతు వేదిక కోసం శుక్రవారం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది తెలుసుకున్న నాయకులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని అభివృద్ధిని చూసి ఓర్వలేని వారే ఈ పని చేసినట్టు అనుమానిస్తున్నారు.
చింరాజ్పల్లిలో రైతు వేదిన నిర్మాణ శిలాఫలకం ధ్వంసం - latest news of collapses the memorial
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలో రైతు వేదిక కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చింరాజ్పల్లిలో రైతు వేదిన నిర్మాణ శిలాఫలకం ధ్వంసం
తెరాస నాయకులు దీనిపై ఏవో సాయరెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు ఎస్సై శోభన్ బాబు తెలిపారు.