నిజామాబాద్ నగరానికి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి అభరణాలు, నగదు చోరీ చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడున్నర కిలోల వెండి ఆభరణాలు, రూ. 30 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గత నెల 28న బోధన్ పరిధిలో అర్ధరాత్రి సమయంలో నగర వ్యాపారి హరి గుప్తా కారును అడ్డగించిన దుండగులు 4 కిలోల వెండి ఆభరణాలు, రూ.40 వేల నగదును అపహరించారు. వ్యాపారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు.