కులం పేరుతో పరువు హత్యలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు పడేలా నూతన చట్టాలు రావాలని నిజామాబాద్ సీపీఐ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ఆకుల హన్మంత్ భవన్లో న్యూడెమొక్రసీ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల నిర్మూలన సదస్సులో ఆయన ప్రసంగించారు.
పరువు హత్యలపై కొత్త చట్టాలు తీసుకురావాలి: న్యూడెమోక్రసీ - కొత్త చట్టాలు
కులం పేరుతో పరువు హత్యలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాలు తీసుకురావాలని సీపీఐ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లోని ఆకుల హన్మంత్ భవన్లో నిర్వహించిన కుల నిర్మూలన సదస్సులో ఆయన మాట్లాడారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు.
పరువు హత్యలపై కొత్త చట్టాలు తీసుకురావాలని సీపీఐ డిమాండ్
అంటరాని వారి కోసం పూలే దంపతులు ఎంతో కృషి చేశారని, కానీ నేటి సమాజంలో కులం పేరుతో రోజు రోజుకి హత్యలు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలు స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి పరుచూరి శ్రీధర్, ఇతర నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: భాజపా నాయకులు
Last Updated : Oct 1, 2020, 10:05 AM IST