నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి జంతువధ చేయడం వివాదాస్పదమయింది. బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో బక్రీద్ సందర్భంగా ఓ వర్గానికి చెందిన వారు.. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో జంతువధ చేస్తున్నారని తెలిసి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జంతువధ.. స్థానికుల ఆగ్రహం!
కరోనా నేపథ్యంలో బక్రీద్ సందర్భంగా పశువులను వధించరాదని, మేకలు బలి ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆజ్ఞలను ఉల్లంఘించి నిజామాబాద్ బోధన్ మండలంలో జంతువధ చేశారు. సమాచారం అందుకున్న స్థానికులు జంతువధను అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి జంతువధ.. స్థానికుల ఆగ్రహం!