దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందే కాంగ్రెస్ అని నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
పార్టీ.. 137వ సంవత్సరంలోకి అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని మోహన్ పేర్కొన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌ల నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఇప్పటినుంచే కార్యాచరణను ప్రారంభిస్తామని వివరించారు.