'కేసీఆర్ కుట్రకు వ్యతిరేకంగా.. సమ్మె జరుగుతోంది' - ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మద్దతు
ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టి ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఆ కుట్రకు వ్యతిరేకంగానే ఆర్టీసీ సమ్మె జరుగుతోందని స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మద్దతు
ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో గెలవడం గెలుపే కాదన్నారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి ఇప్పుడు ప్రైవేటుపరం చేయడానికి కుట్ర పన్నుతున్నారని విమర్శించారు.
- ఇదీ చూడండి : "కేసీఆర్ వ్యాఖ్యలు బాధాకరం.. అంతిమ విజయం మాదే.."