నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలోని పులాంగ్ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేశారు.
నిజమాబాద్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి - మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి 2020
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
నిజమాబాద్లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి
దేశం కోసం, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆమె చేసిన సేవలను కాంగ్రెస్ నాయకులు గుర్తుచేసుకున్నారు. దేశఖ్యాతిని నలుమూలల చాటిన గొప్ప వ్యక్తి ఇందిరాగాంధీ అని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు, హస్తం శ్రేణులు తదితరలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వరద సాయం కోసం ఉప్పల్లో బాధితుల ఆందోళన