నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత మెడపాటి ప్రకాష్ రెడ్డి.. భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు తెరాస, కాంగ్రెస్కు చెందిన పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
'కాంగ్రెస్ను వీడుతా.. భాజపాలో చేరతా' - Congress leader Medapati Prakash Reddy latest coments
కాంగ్రెస్కు తెలంగాణలో మరో ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నుంచి తేరుకోక ముందే.. పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. తాజాగా అదే బాటలో సిద్ధమయ్యారు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత మెడపాటి ప్రకాష్ రెడ్డి. త్వరలోనే.. భాజపాలో చేరనున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ను వీడనున్న మెడపాటి ప్రకాష్ రెడ్డి
2008 ఎన్నికల్లో తెదేపా నుంచి ప్రకాష్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం.. తెరాసలోకి వెళ్లారు. 2019లో కాంగ్రెస్ గూటికి చేరారు. హస్తంలో ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాల సేకరణ