ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. దాన్ని పాటించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా తెరాస నేతలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి... జిల్లా పాలనాధికారి నారాయణ్రెడ్డికి, శాసనమండలి ఉప ఎన్నికల అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఎన్నికల కోడ్ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్ - నిజామాబాద్ కాంగ్రెస్
స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అధికారులకు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందించారు. ఎన్నికల కోడ్ పాటించకుండా తెరాస నేతలు పార్టీలోకి వలసలు ప్రోత్సహించారని ఆరోపించారు.
ఎన్నికల కోడ్ పట్టించుకోకుండా తెరాసలోకి స్థానిక ఎంపీటీసీలు, జడ్పీటీసీలను కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారని ఆరోపించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్‌ల మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని కోరారు. కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికార పార్టీ నాయకులు మాత్రం పార్టీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టడం నీచమైన చర్య అని మోహన్ రెడ్డి విమర్శించారు. ఇతర పార్టీలలో గెలిచి తెరాసలో చేరిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లను ఎన్నికల్లో ఓటు వేయకుండా అనర్హులుగా ప్రకటించాలని కోరారు.
ఇదీ చదవండి:ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు