గంగపుత్రులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నిజామాబాద్ జిల్లా గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గంగపుత్రులు నగరంలో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు.
తలసానిని బర్తరఫ్ చేయాలంటూ గంగపుత్రుల ఆందోళన - nizamabad district latest news
గంగపుత్రులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని నిజామాబాద్ జిల్లా గంగపుత్ర సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన గంగపుత్రులు నగరంలో శనివారం భారీ ప్రదర్శన నిర్వహించారు. మంత్రి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు.
కలెక్టరేట్ ఎదుట గంగపుత్రుల ఆందోళన..
రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీ ప్రారంభమై తిలక్‌గార్డెన్, రైల్వే స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తాకు వరకు చేపల వలలను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో రహదారిపై బైఠాయించారు. అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చి ప్రధాన ద్వారం ఎదుట కూర్చున్నారు. తర్వాత జిల్లా పాలనాధికారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ఇదీ చదవండి:గోల్కొండ కోటపై భాజపా జెండా ఎగరేయటమే లక్ష్యం